Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » తీపి భూ చక్రాలు (దీపావళి స్పెషల్)

తీపి భూ చక్రాలు (దీపావళి స్పెషల్)

Written By Kiran on Saturday 29 October 2016 | ANUSHA 22:29:00


కావలసిన పదార్ధాలు :
మైదా                       - 1 కప్పు 
పాలు                       - 1/2 లీటరు 
చెక్కెర                      - 1 1/2 కప్పు 
కుంకుమ పువ్వు       - చిటికెడు 
పిస్తా పప్పు                - కొద్దిగా 
ఉప్పు                        - చిటికెడు 
నూనె వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం :
      ముందుగా మైదాలో చిటికెడు ఉప్పు కలిపి పూరీ పిండిలా గట్టిగా కలుపుకుని అరగంట నానబెట్టుకోవాలి. పాలలో చెక్కర, కుంకుమ పువ్వు వేసి ఉంచుకోవాలి. మైదా నానిన తరువాత ఆపిండి మొత్తాన్ని రెండు భాగాలుగా విడదీసి ఒక ముద్దను బాగా మర్దనా చేసి పలుచగా పెద్ద పూరీలా వత్తుకుని  ఆ  పలుచని  పెద్ద పూరీపై నూనెరాసి దానిపై గోధుమ (లేక) వరిపిండి జల్లి చాప చుట్టుగా ఆ పూరీచుట్టుకోవాలి. పొడవుగా కర్రలా వున్న ఆ చుట్టని చాకుతో చక్రాలుగా  కోసుకొని  ఒక్కో ఉండని చేతిలో గుండ్రంగా అదమాలి. లోపల పోరలతో గుండ్రని భూ చక్రాలుగా ... ఈ  అన్ని బిళ్ళలనూ వత్తుకొని వేడి నూనెలో దోరగా వేయించుకుని ప్రక్కన పెట్టుకోవాలి. మిగిలిన పిండినీ ఇలాగా చేసి వేయించుకోవాలి. ప్రక్క స్టౌవ్ మీద  దళసరి గిన్నెలో చిన్న మంటపై పాలు, చెక్కెర కుంకుమ పువ్వులు వేసి కలుపుతూ మరిగించుకొని.... ఈ బిళ్ళలను ఒకొక్కటిగా వేసి  స్టౌవుని ఆ పేసి అరగంట భూ చక్రాలను వేరే పళ్ళెంలోకి తీసుకుని పిస్తా పప్పు తో  అలంకరించుకోవాలి .
SHARE

About Kiran

0 comments :

Post a Comment

Thanks for comments

Recipes