కావలసినవ పదార్ధాలు :-
బ్రౌన్ రైస్ - 1 కప్పు
బెల్లం (లేక ) చెక్కర - 1 కప్పు
నేయి - ౩ చెంచాలు
కొబ్బరి ముక్కలు - పావు కప్పు
కాజు, పిస్తా, కిస్ మిస్ - అన్నికలిపి 8 లేదా 10 ముక్కలు
ఇలాచి పొడి - చిటికెడు
తయారుచేసే విధానం :
* ముందుగా 2 గంటలపాటు బ్రౌన్ రైస్ ని నానబెటుకోవాలి.
* ఇప్పుడు రైస్ కుక్కర్ లో గాని మాములు కుక్కర్ లో గాని మెత్తగా ఉడికించుకోవాలి.
* దళసరి మూకుడులో ముందుగా 2 చెంచాలు నెయ్యి వేసి వేడి ఎక్కిన తరువాత అందులో కొబ్బరి ముక్కలు జీడిపప్పు, పిస్తా, కిస్ మిస్ లు వేసి దోరగా వేయించి తీసేసుకోవాలి.
* మూకుడులో చెక్కర లేక బెల్లం వేసి కొద్దిగా నీరు పోసి అది మరిగి బుడగలుగా పాకం వచ్చేసమయంలో మెత్తగా చిదిపిన అన్నం వేసి కొద్ది ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఇలాచి పొడి జల్లి...ముందుగా వేయించి పెట్టుకున్నకొబ్బరి డ్రైఫ్రూట్ ముక్కలు వేసి అలంకరించుకోవాలి.
0 comments :
Post a Comment
Thanks for comments